ఐదేళ్లక్రితం దరఖాస్తు
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఆవుల స్వర్ణ మానసిక దివ్యాంగురాలు. ఆమె సదరం సర్టిఫికెట్‌లో 100 శాతం వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దివ్యాంగుల పింఛన్ కోసం ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కానీ పింఛన్ మంజూరు కాలేదు. తన కూతురికి పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆమె తండ్రి ఆవుల సింహాద్రి ఏడాది కిందట సూర్యాపేట కలెక్టరేట్లో కూడా అర్జి అందించాడు. ఏళ్లు గడుస్తున్నాయే కానీ పింఛన్ మంజూరు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


