23న నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్‌ను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు డీఈఓ కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,262 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా వారికి సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, సిటీ హైస్కూల్, ప్రభుత్వ నం–2 ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎంఏఎం పాఠశాల, కోదాడలోని కేబీఎస్‌ఎస్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల, ఎస్‌టీ జోసెఫ్ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏది అక్రమ విజయం
సూర్యాపేట అర్బన్ : బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ప్రజల మధ్య కులం, మతోన్మాదం పేరుతో విద్వేశాలు సృష్టించి, అధికార యంత్రంగాన్ని వినియోగించుకొని అక్రమ పద్ధతిలో విజయం సాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ, హోం మంత్రితో సహా ఎన్డీఏ నేతలు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందారని, దుర్మార్గమైన వారి ఎత్తుగడలకు కార్పోరేట్ మీడియా పూర్తి సహకారం అందించిందన్నారు. బిహార్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 85 లక్షల మంది ఓట్లను తొలగించిందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.
సకాలంలో సిలబస్
పూర్తి చేయాలి
నడిగూడెం : ఇంటర్ సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలని డీఐఈఓ వి.భానునాయక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల, కరివిరాల మోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలని, అధ్యాపకులు సమయ పాలన పాటించాలని సూచించారు. ఉదయం స్టడీ అవర్స్ నిర్వహించి, చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్స్ డి.విజయనాయక్, సాయి ఈశ్వరి, అధ్యాపకులు ఉన్నారు.
నేడు సూర్యక్షేత్రంలో కార్తీక వనభోజనాలు
అర్వపల్లి : కార్తీక మాసం సందర్భంగా తిమ్మాపురం శివారులోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుపనున్నట్లు క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్‌స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
23న నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్


