వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలి
సూర్యాపేట అర్బన్ : సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వయోవృద్ధులైన తల్లి దండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలదే అన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హమీద్ ఖాన్, సభ్యులు కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, కాకి మల్లారెడ్డి, సీడీపీఓలు సుబ్బలక్ష్మీ, కిరణ్మయి, శ్రీజ, సూపర్ వైజర్ వినోద్‌కుమార్ పాల్గొనారు.
వృద్ధులకు ఆటల పోటీలు
మునగాల : మండలంలోని ముకుందాపురం శివారులో గల ఇందిర అనాథ వృద్ధాశ్రమంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వృద్ధులకు శని వారం ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. వృద్ధులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించా రు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు
వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలి


