దేశభక్తిని పెంపొందించడంలో పటేల్ పాత్ర మరువలేనిది
సూర్యాపేట : దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని ఎంపీ కేశ్రీ దేవ్ సిన్హాజ్వాల కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జూనియర్ కళాశాల మైదానంలో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్‌ను ఆయన ప్రారంభించారు. పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అధికారులు, విద్యార్థులు ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భానునాయక్ పాల్గొన్నారు.


