మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్
సూర్యాపేట : జిల్లాలో 2025–26 సంవత్సరానికి 3వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ వెల్లడించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 2,011 ఎకరాలను గుర్తించి 1,139 ఎకరాలకు సబ్సిడీ మంజూరు చేయగా 696 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వివరించారు. అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం హార్టికల్చర్ టెక్నికల్ అధికారి మహేష్ పీపీటీ ద్వారా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ప్రవీణ్, ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి నివేదిత, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్య, పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో డ్రగ్స్ నార్కోటిక్‌పై ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల జీవితాలు ఎలా పాడవుతున్నాయో తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్,డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్, డీపీఓ యాదగిరి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, విద్యాశాఖ కోఆర్డినేటర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


