విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
హుజూర్‌నగర్ : పాలకవీడు మండలంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని యల్లాపురం గ్రామంలో రూ.3.20 కోట్లతో చేపట్టనున్న 33/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి, మూసీఒడ్డుసింగారం గ్రామం నుంచి రోళ్లవారిగూడెం వరకు రూ.1.80 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బెట్టెతండా వద్ద మూసీ నదిపై రూ.33 కోట్లతో చేపడుతున్న సాగునీటి లిఫ్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ క్యాక్రమంలో ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్‌వి.సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాళోతు మోతీలాల్, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, గుత్తికొండ భూపాల్‌రెడ్డి, తీగల శేషురెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


