ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి
సూర్యాపేట : మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో మంచి ఫలితాలు సాధించాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, మధ్యాహ్న భోజన కేంద్రాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణత శాతం
పెంపునకు కృషి చేయాలి
సూర్యాపేట: పదో తరగతి వార్షిక పరీక్ష ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషిచేయాలని డీఈఓ అశోక్ ఉపాధ్యాయులను కోరారు. బుధవారం పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చీదెళ్ల, దూపహాడ్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో బోధన తీరును పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి పాఠ్యపుస్తకాలపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి 6, 7వ తరగతి విద్యార్థుల పఠనాశక్తి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు వై. లింగయ్య, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, జనార్దనాచారి, శ్రీనివాస్, అంజినికుమార్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి
నూతనకల్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక శక్తిగా ఎదగాలని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ జాన్సన్ సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో వివిధ పథకాల ద్వారా బ్యాంకు లింకేజీతో ఏర్పాటు చేసిన వ్యవసాయేత ఉత్పత్తులను పరిశీలించారు. మిల్క్ ప్రాడక్ట్‌స్ యూని ట్స్, టీ పొడి, కిరాణషాపులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను సక్రమంగా నిర్వహించి ఆర్థిక లాభాలను పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ అప్పారావు, ఏపీడీ సురేష్, డీపీఎం అరుణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఏపీఎం నగేష్, వెంకట్‌రెడ్డి, సీసీ సునిత, వీవోలు సత్తెయ్య , అనిల్, భాగ్యలక్ష్మి, పరుశరాములు, గీత, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
భువనగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 84 కళాశాలలు, వాటిలో 16,867 మంది విద్యార్థులున్నారు. 1,3,5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 9, భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఉన్నాయి. సెమిస్టర్–1కు 5,400, సెమిస్టర్–3కి 5,830, సెమిస్టర్–5కు 5,597 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి.
ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి
ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి


