మైసమ్మ జాతరకు ముస్తాబు
కోరిన కోర్కెలు తీర్చేఅమ్మవారు
మఠంపల్లి: మంచ్యాతండా దుబ్బలగట్టు బంగారు మైసమ్మతల్లి జాతరకు గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగులతో తీర్చిద్దారు. ఈ ఆలయంలో ఈనెల 15నుంచి 17వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనునిత్యం మహిళా పూజారి పానుగోతు మిర్యాలీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బంగారుమైసమ్మ జాతరను గిరిజనులు పెద్దపోలిగ గా పిలుస్తారు. ఈజాతరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు ఏపీలోని గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని తండాలకు చెందిన గిరిజనులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 15న రాత్రి 9గంటలనుంచి అర్ధరాత్రివరకు అమ్మవారి చరిత్ర పారాయణం చేస్తారు.16వ తేదీ తెల్లవారుజామున 3గంటలనుంచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని అదేవిధంగా దున్నపోతును భారీగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఉదయం 10గంటలకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం భారీగా అన్నదానం చేస్తారు.17న అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగిస్తారు. ఈసందర్భంగా గిరిజన యువకులతో కోలాటం, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా నిర్వాహకులు అన్నిర్పాట్లు చేశారు.
దుబ్బలగట్టు శ్రీబంగారు మైసమ్మ అమ్మవారు భక్తులు కోరిన కో ర్కెలు తీర్చే చల్లని తల్లి. చాలా కాలంగా అమ్మవారికి పూజలు సేవలు చేస్తున్నాను. ఇటీవల పెద్దలంతా ఆలయాన్ని లక్షల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు దున్నను బలి ఇచ్చే విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ.
–పానుగోతు మిర్యాలీ,
ఆలయ మహిళా పూజారి.
ఫ 15 నుంచి మూడురోజుల
పాటు ఉత్సవాలు
ఫ భారీగా తరలిరానున్న గిరిజనులు.
మైసమ్మ జాతరకు ముస్తాబు


