వేలకోట్లతో శరవేగంగా అభివృద్ధి
మఠంపల్లి: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయతో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మఠంపల్లి మండలం బక్కమంతుగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయా నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. విద్యావకాశాల మెరుగు పర్చడానికి గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కోదాడలో రూ.50కోట్లతో నవోదయ పాఠశాల, హుజూర్‌నగర్ సమీపంలో రూ.100కోట్లతో వ్యవసాయ కళాశాల, ముఖ్యంగా కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రూ.1500కోట్లతో 6వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. హుజూర్‌నగర్‌లో డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్మాణం, హుజూర్‌నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి వరకు ఆంధ్రా ప్రాంతాన్ని కలుపుతూ నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.80కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల హుజూర్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా స్థాయిలో 25వేల మంది నిరుద్యోగులతో జాబ్‌మేళా నిర్వహించి 4,500మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. మున్ముందు మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బక్కమంతులగూడెం పాఠశాలకు స్థలం ఇచ్చిన అంతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్తమ్‌ను నాయకులు, అదికారులు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మగారాథోడ్, నాయకులు మంజీనాయక్, కిషోర్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు, సీతారామిరెడ్డి, గోవిందరెడ్డి, వీరారెడ్డి, ఎల్లారెడ్డి, బాబు, శ్రీను, సక్రు, కరీమ్, అజీజ్‌పాషా, నాగరాజు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫ నీటిపారుదలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


