విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు కష్టపడి చదువాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్‌కౌసర్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంచి విద్య ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోగలమన్నారు. న్యాయవిద్య ద్వారా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై బాలికలకు వివరించారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ బాలికల సంరక్షణ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోషి యేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికారసంస్థ
కార్యదర్శి ఫర్హీన్ కౌసర్


