పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు
సూర్యాపేట : వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు, కూలీలు, చిన్న పిల్ల లను గూడ్స్ వాహనాలలో రవాణా చేసినా, పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాలలో రవాణా చేసిన కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 70 వాహనాలను గుర్తించి జరిమానాతో పాటు కేసులు విధించినట్లు వివరించారు.
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నరసింహ అధికారులను కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులనుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఎస్పీ నరసింహ


