ఉత్సాహంగా యువజనోత్సవాలు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ అంశాల్లో యువత పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని యువత ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు మెమొంటోలు, మెరిట్ సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బహుమతులు సాధించింది వీరే..
జానపద నృత్యం గ్రూప్..
ప్రథమ స్థానం : టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ, సూర్యాపేట
ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్‌ఎస్, ఏనుబాముల
తృతీయ స్థానం : పాలిటెక్నిక్ కళాశాల సూర్యాపేట
జానపద పాటలు గ్రూప్..
ప్రథమ స్థానం: టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ, సూర్యాపేట
ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ
తృతీయ స్థానం : జెడ్పీహెచ్‌ఎస్ జలాల్‌పురం
ఉపన్యాసం..
ప్రథమ స్థానం: ఏఆర్ శారియా, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
ద్వితీయ స్థానం: క్రిషిత, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట
తృతీయ స్థానం:బి.మహాంత్రి, టీజీటీడబ్ల్యుయుఆర్‌జేసీ, చివ్వెంల
కథా రచన..
ప్రథమ స్థానం: ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
ద్వితీయ : పి.కీర్తిన, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సూర్పాయేట
తృతీయ : డి.లోహిత, టీజీటీడబ్ల్యువీఆర్‌జేసీ చివ్వెంల
పెయింటింగ్..
ప్రథమ స్థానం : ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
ద్వితీయ : పి.కీర్తన, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట
తృతీయ : కె.సుప్రియా, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట
వ్యాస రచన..
ప్రథమ స్థానం: ఆర్.సరిత, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
ద్వితీయ : కె.సుప్రియ, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట
తృతీయ : టి.గురుదీప్ కౌర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట
సైన్స్‌మేళా..
ప్రథమ స్థానం: జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ
ద్వితీయ స్థానం: జెడ్పీహెచ్‌ఎస్, ఏనుబాముల
తృతీయ స్థానం: జెడ్పీహెచ్‌ఎస్, జలాల్‌పురం.
ఫ పోటీలను ప్రారంభించిన
అదనపు కలెక్టర్ సీతారామారావు
ఫ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల
అందజేత
ఉత్సాహంగా యువజనోత్సవాలు


