ఇంటి ముందే మట్టి పోశారు
మ్యాన్ హోల్స్ కోసం గుంటలు తీశారు. తీసిన మట్టి ఇంటి ముందే పోయడంతో ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. అధికారులు స్పందించి యూజీడీ పనులను త్వరగా పూర్తిచేయించాలి.
– కేశగాని సతీష్, బాలాజీ నగర్
రోడ్డు మధ్యలో తవ్వి పైప్‌లైన్ వేసిన తర్వాత మట్టితో పూడ్చి వదిలేశారు. అది కాస్త వర్షానికి కుంగి బురద మడుగులా తయారైంది. వీధుల్లో నడవడానికి, వాహనాలకు ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న గుంటలపై సిమెంట్ ప్యాచెస్ వేయాలి.
– బొమ్మగాని లోకేష్, బాలాజీ నగర్
ఇంటి ముందే మట్టి పోశారు


