కళాకారులను ఆదుకోవాలి
సూర్యాపేట అర్బన్ : యాభై ఏళ్లు నిండిన జానపద వృత్తి కళాకారులకు నెలకు రూ.4వేల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా నాట్య మండలి (పీఎన్‌ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ ప్రభుత్వానికి కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన పీఎన్‌ఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్న జానపద కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 4 5 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న పీఎన్‌ఎం రాష్ట్ర మహాసభలు, జానపద సంబరాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, అధ్యక్షుడు బచ్చలకూర రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పిడమర్తి అశోక్, మామిడి నాగ సైదులు, బూరుగుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


