
అవినీతికి ఆస్కారం ఉండొద్దు
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్.. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తమదే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైందని.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ పనులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని.. మేము వచ్చాకే నీటికేటాయింపులుచేసి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలతో పాటు లిప్టులు, హైలెవల్ కెనాల్ లైనింగ్‌కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. అయిటిపాముల, గంధమల్ల రిజర్వాయర్లకు రూ.500 కోట్లు మంజూరు చేసి సీఎంతో పనులు ప్రారంభించామన్నారు. రాచకాల్వ మరమ్మతు పనులు చేయాలని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారని వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.