
ముగిసిన రేషన్ బియ్యం పంపిణీ
సూర్యాపేట : మూడు మాసాల రేషన్ పంపిణీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 86 శాతం మంది రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషనన్‌షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్ లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి.
రెండునెలల తర్వాతే..
జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్ మాసంలోనే రేషనన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 86 శాతం మంది కార్డుదారులు జిల్లాలో రేషన్ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్‌లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్‌షాపులు మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్‌షాపులు తెరుచుకోనున్నాయి.
సన్న బియ్యం తీసుకున్న 86
శాతం మంది లబ్ధిదారులు
రెండు నెలలపాటు
మూతపడనున్న రేషన్ షాపులు
రేషన్ పంపిణీ ఇలా..
రేషన్ దుకాణాలు : 601
మొత్తం కార్డులు : 3,24,158
బియ్యం తీసుకున్నవారు : 2,80 లక్షల మంది