
యాదగిరిగుట్టలో ఆర్టీఏ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని పాతగుట్టలో 33 జిల్లాలకు చెందిన రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(నాన్ అఫీషియల్) సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీఏ సభ్యుడు ఆకుల నరసింహ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రయాణికులకు ప్రయోజనం కల్పించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా పరమైన సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి విషయాల్లో రవాణా శాఖ అధికారులతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా తమవంతు కృషి చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ జిల్లా సభ్యులు పడాల రాహుల్, జాఫర్, వెంకన్న, కృష్ణ, అభిగౌడ్, భూపాల్‌రెడ్డి, మురళీ తదితరులున్నారు.