
50ఏళ్ల అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని అన్నారం జెడ్పీహెచ్‌ఎస్‌లో 1974–1975లో 8వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 50 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య, హసనాబాదు సోమయ్య, రేసు సత్తయ్య, సుదర్శన్, సోమయ్య, లక్ష్మయ్య, పూర్వ విద్యార్థులు శేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి, గోవర్ధన్, వెంకట్ రెడ్డి, అమృతరెడ్డి, సత్తిరెడ్డి, సత్తయ్య, యాదగిరి, పాల్గొన్నారు.