
ఉపాధి కూలీల కషా్టలు
నాగారం : ఉపాధి పనులు చేసే కూలీలకు అందించే వేతనాలను అధికారులు పోస్టాఫీసుల్లో జమ చేస్తున్నారు. అయితే పల్లెల్లో తపాలా సేవలు అందుబాటులో లేకపోవడంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలకు పోస్టల్ సేవలు లేక ఉపాధి కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లి వేతనాలు తీసుకోవాల్సి వస్తోంది. జనాభా పెరుగుతున్నా కొత్త వాటిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులతో పాటు పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో పోస్టాఫీసులు లేకపోవడంతో పొదుపునకు అవకాశం ఉండడం లేదు. గ్రామాల్లో తపాలా సేవలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఫ పల్లెల్లో తపాలా సేవలు అందక అవస్థలు
ఫ వేతనాలు తీసుకునేందుకు
దూరప్రాంతాలకు
జిల్లాలో ఇలా...
గ్రామ పంచాయతీలు 486
బ్రాంచ్ పోస్టాఫీసులు 319
సబ్ పోస్టాఫీసులు 29