
లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించవద్దు
నేరేడుచర్ల: లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏఓ) జి. శ్రీధర్‌రెడ్డి సూచించారు. శనివారం నేరేడుచర్లలోని విజయలక్ష్మి ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌లతో పాటు విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు దొరుకుతున్నాయన్న ఆశతో లైసెన్స్‌లేని వారి వద్ద నుంచి కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు తప్పని సరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి జావిద్‌తో పాటు దుకాణ యజమాని పోలా విశ్వనాథం ఉన్నారు.
అగ్రికల్చర్ కాలేజీ
ఏర్పాటుకు స్థల పరిశీలన
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రెవెన్యూ, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూరివర్సిటీ అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. హుజూర్‌నగర్, బూరుగడ్డ శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ రమావత్ రవి, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఏఓ ప్రీతం, డీఐ వంశీ, మండల సర్వేర్ మంజుల పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించవద్దు