
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అనుధాన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. చెప్పారు.
డ్రగ్స్ నిర్మూలన
అందరి బాధ్యత : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత అని, ఇందులో భాగంగా ఈనెల 26న డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగంతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధ్వర్యంలో డ్రగ్స్ నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, వివిధ సంఘాల వారు ఈ అవగాహన కార్యక్రమాలల్లో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడాలని కోరారు.
ఖైదీలు సత్ప్రవర్తన
కలిగి ఉండాలి
చివ్వెంల : కై దీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని సబ్ జైలును సందర్శించారు. జైలు పరిసరాలను పరిశీలించి, ఖైదీలను ఆరోగ్య సమస్యలు, ఆహార వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూపరింటెండెంట్ బి.సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. జైలులో ఉన్న ఖైదీలకు న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. లేనట్లయితే జిల్లా న్యాయసేవాధికార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, ఉచితంగా న్యాయసేవలు అందిస్తామమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డిప్యూటి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.వెంకటరత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ పెండెం వాణి, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
అర్వపల్లి : తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ అంజిరెడ్డి కోరారు. అర్వపల్లిలో శుక్రవారం జరిగిన ఉద్యమకారుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటిస్థలాన్ని, నెలకు రూ.25వేల ఫించన్‌ను ఇవ్వాలన్నారు. ఈసందర్భంగా సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌గా అర్వపల్లికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దిర్శనపు కృష్ణమూర్తిని నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సమాశేశంలో తెలంగాణ ఉద్యమకారులు కుదురుపాక ఉదయ్, లింగంపల్లి రమణ, దడిపల్లి వెంకట్, కుంభం మధు, శివ, యాదగిరి, కొమారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో
ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం!
సూర్యాపేటటౌన్ : డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ ఉద్యోగి అయిన ఇన్‌చార్జి డెమో మనోహరరాణి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు అడ్డుకున్నట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జి డెమో మనోహరరాణి మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై డాక్టర్ చంద్రశేఖర్‌పై జిల్లా కలెక్టర్‌కు సైతం మనోహరరాణి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వివరణ కోరగా విధి నిర్వహణలో అలసత్వం తగదని మందలించిన విషయం వాస్తవమేనని, అందుకే తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని తెలిపారు.