ఆరోగ్య‘యోగ’ం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య‘యోగ’ం

Jun 21 2025 2:59 AM | Updated on Jun 21 2025 2:59 AM

ఆరోగ్య‘యోగ’ం

ఆరోగ్య‘యోగ’ం

తాళ్లగడ్డ (సూర్యాపేట) : మనస్సు, వాక్కు, కర్మలను నియంత్రించుకోవడంతో పాటుగా శారీరక ప్రశాంంతతను పొందేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ధ్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మన దేశంలో పుట్టిన యోగాను ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అనుసరించడమే గాక ఐక్యరాజ్యసమితి జూన్‌ 21న యోగా దినోత్సవంగా ప్రకటించడం మన దేశానికి దక్కిన గౌరవంగా చెప్పొచ్చు.

యోగాపై పట్టణ ప్రజల ఆసక్తి

నిత్య యోగా సాధన రక్తంలో మలినాలను శుద్ధి చేస్తుంది. శరీరంలో ప్రాణవాయువు పెంచుకునే ప్రక్రియ యోగాతోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా నగరాల్లో ఉండే ప్రజలు జంక్‌ఫుడ్‌ తినడం కారణంగా వ్యాధులతో బాధపతుంటారు. అలాంటి వారు స్వతహాగా లేదా డాక్టర్ల సలహా మేరకు యోగా కేంద్రాలను ఆశ్రయిస్తూ వారి శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

ప్రయోజనాలు ఇలా..

ఆరోగ్యంగా ఉండటమే గాక చురుకుగా తమ పనులను పూర్తి చేసేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం యోగా చేయడంతో మానసిక ప్రశాంతత ఉంటందని యోగా గురువులు చెబుతున్నారు. బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, తలనొప్పి, సైనస్‌, మలబద్ధకం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు, అధిక బరువు, నిద్రలేమి, ప్రత్యేకంగా మగవారికి నరాల బలహీనత, గర్భిణులకు సుఖప్రసవం, మహిళలకు గైనిక్‌ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతి రోజూ యోగాసనాల వేయడం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు.

ఫ నిత్య యోగాతో జ్ఞాపకశక్తి

వృద్ధి, ఒత్తిడి దూరం

ఫ మానసిక స్థిరత్వానికి

ధ్యానం ఉపయోగం

ఫ శారీరక సమతుల్యతకు

యోగాసనాలు దోహదం

ఫ యోగాపై ఆసక్తి చూపుతున్న

నేటి యువత

ఫ నేడు జాతీయ యోగా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement