
మహోన్నత వ్యక్తులు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్
నాగారం : అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహాన్నత వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. నాగారం మండలం పసునూర్ గ్రామంలో మాదిగ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు, విగ్రహాల ఏర్పాటు కమిటీ చైర్మన్ మల్లెపాక అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను శుక్రవారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జాతి గర్వించే మహనీయులని కొనియడారు. ఆ మహానీయుల ఆశయాల సాధనలో భాగంగా కొనసాగిన 35 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అన్నారు. దళిత జనోద్ధరణ కోసం జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, వాగ్గేయకారుడు గిద్దె రామనర్సయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు సుంకరి జనార్దన్, నాయకులు గంధమల్ల యాదగిరి, గుడిపాటి సైదులు, చింతకుంట్ల వెంకన్న, చిన్న శ్రీరాములు, చిప్పలపల్లి మల్లేష్, అయోధ్య, బాలయ్య, శ్రీను, కిషోర్, రాజయ్య, తోడుసు లింగయ్య, బిక్కి శ్రీను, సోమన్న, బొజ్జ సైదులు, పంది శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు, ఆయా అనుబంధ సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మంద కృష్ణమాదిగ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
ఫ పసునూర్‌లో మహనీయుల
విగ్రహాల ఆవిష్కరణ