
యాదవులకు మంత్రి పదవి లేకపోవడం బాధాకరం
సూర్యాపేట : యాదవులకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. యాదవ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న యాదవ ఆత్మగౌరవ ధర్నా పోస్టర్‌ను గురువారం సూర్యాపేట పట్టణంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ యాదవ మంత్రులు లేకుండా ప్రభుత్వాలు లేవని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో 28 లక్షల మంది యాదవులు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 10 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడింగ్ గోవర్దన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ, అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తగుల జనార్దన్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ గుడ్డేటి సైదులు యాదవ్, కోడి లింగయ్య యాదవ్, బడుగుల సైదులు యాదవ్, కంచుగట్ల జానయ్య యాదవ్, నాగార్జున యాదవ్, సైదులు యాదవ్, కాసం రాము యాదవ్, ఉగ్గం నగేష్ యాదవ్ ఉన్నారు.