
మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
కోదాడరూరల్ : ప్రధాని నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి పేర్కొన్నారు. గురువారం కోదాడ మండలం రామలక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం నిర్వహించిన సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లారావు, నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, కన గాల నారాయణ, వెంకటేష్‌బాబు, పురుషోత్తం, జనార్దన్ తదితరులు ఉన్నారు.