
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
హుజూర్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం హుజూర్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. కగార్ నిర్వహించే చోట ఖనిజ సంపద ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నాయకులు రమేష్, కష్ణ, మామిడి వెంకయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.