
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మునగాల: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మునగాల మండలం నర్సింహులగూడెంలో మండల పార్టీ అధ్యక్షుడు మైలార్‌శెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. కేంద్ర పథకాలతో గ్రామీణ ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నారన్నారు. రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కనగాల నారాయణ, భద్రంరాజు కృష్ణంరాజు, జల్లా జనార్దన్, మల్లెబోయిన వెంకటేష్‌బాబు, మండల నాయకులు శ్రీనివాసరెడ్డి, పనస రమేష్, కపిల్‌రెడ్డి, గోవిందాచారి, ఆర్.శ్రీనివాసరెడ్డి, పి.నాగరాజు, శ్రీకాంత్, ముదిరెడ్డి వెంకటరెడ్డి, మండవ చినసైదులు , వినోద్, ప్రభాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.