
మాట్లాడుతున్న శాస్త్రవేత్త లవకుమార్
గరిడేపల్లి : పాడి రైతులు పశు గ్రాసం పంటలను సాగు చేసుకోవాలని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్ సూచించారు. తద్వారా పశుపోషణకు అయ్యే ఖర్చులు తగ్గి పాల ఉత్పత్తి పెరగుతుందని అన్నారు. బుధవారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో పశుగ్రాస పంటల సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పశుగ్రాస పంటల సాగు ద్వారా పచ్చిమేతను పశువులకు దాణాగా ఇచ్చినప్పుడు సులభంగా తింటాయని తెలిపారు. అధిక పోషక విలువలు కలిగిన రుచికరంగా ఉండటం వలన సులభంగా జీర్ణం అవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు సుగంధి, నరేష్ తదితరులున్నారు.