శాలిగౌరారం: కోతుల దాడిలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయునిగూడేని చెందిన టేకుల వేణు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాల వరండాలో తోటి విద్యార్థులతో కూర్చొని చదువుకుంటున్నాడు. తరగతి గదివద్దకు వచ్చిన కోతులు ఒక్కసారిగా విద్యార్థి వేణుపై దాడి చేశాయి. పక్కన ఉన్న విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కోతులను తరిమికొట్టారు. గాయపడిన వేణును పీహెచ్‌సీకి తరలించారు.
దౌర్జన్యంగా ఇంటి స్థలం ఆక్రమిస్తున్నారని..
ఫ మహిళ ఆత్మహత్యాయత్నం
మఠంపల్లి: దౌర్జన్యంగా ఇంటి స్థలం ఆక్రమిస్తున్నారని ఓ మహిళ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బుడిగె కాశయ్యకు తన ఇంటి వెంట గుంట స్థలం ఉంది. దానికి కాశయ్య చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నాడు. అయితే అతని ఇంటి పక్కన బుడిగె మమత (దివ్యాంగురాలు) 20ఏళ్లుగా నివాసం ఉంటుంది.ఈ క్రమంలో మమత మరుగుదొడ్డి నిర్మాణానికి కాశయ్య సంబంధించిన స్థలంలో తనకు స్థలం ఉందంటూ కలెక్టర్, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించింది. దీంతో గతంలో తాహసీల్దార్, ఎంపీడీఓలు పరిశీలించి మరుగుదొడ్డి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తిరిగి మమత మూడురోజుల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించింది. దీంతో మఠంపల్లి తహసీల్దార్ సాయాగౌడ్ బుధవారం పోలీసుల సహకారంతో కాశయ్య ఇంటిగోడను కూల్చి వేశారు. ఈక్రమంలో కాశయ్య భార్య సుజాత అధికారులతో వాగ్వాదానికి దిగింది. అనంతరం పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు ఆమెను హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.