నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

Jul 3 2025 4:52 AM | Updated on Jul 3 2025 4:52 AM

నేడు

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి రోడ్డు లోని హోటల్‌ సన్‌రైజ్‌లో గురువారం మధ్యా హ్నం 3గంటలకు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షతన సమావేశం జరగనుందని పేర్కొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ స్పీకర్‌, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ కో–ఆర్డినేటర్‌ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌లు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

10,001 గారెలతో అభిషేకం

కాశీబుగ్గ: కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో బంకేశ్వరమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామికి బుధవారం 10,001 గారెలతో అభిషేకం చేశారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

గొట్టా బ్యారేజీ నీరు విడుదల

హిరమండలం : ఖరీఫ్‌లో శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. అనంతరం గొట్టా బ్యారేజీ నీటి నిల్వ, ఔట్‌ ఫ్లో, ఇన్‌ ఫ్లో ప్రవాహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులు మాట్లాడుతూ బ్యారేజీలో ప్రస్తుతం 38.1 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, వంశధార ప్రాజెక్టు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎ.రవీంద్ర, ఒ.ఆనందరావు, వంశధార ఎస్‌ఈ స్వర్ణకుమార్‌ పాల్గొన్నారు.

సీజీఎల్‌ పరీక్షల దరఖాస్తుకు తుది గడువు రేపే

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)–2025 సంవత్సరానికి సంబంధించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారంతో గడువు ముగియనుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌ ‘బి’, ‘సి’ పోస్టులు 14582 ఖాళీలు ఉండగా, ఆగస్ట్‌ 13 నుంచి 30 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 4వ తేదీ రాత్రి 11 గంటలు కాగా, ఫీజు చెల్లింపునకు గడువు జూలై 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉందని వివరించారు. జూలై 9 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉందని తెలిపారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, ఆడిటర్‌ వంటి 37 రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని చెప్పారు.

నేడు వైఎస్సార్‌సీపీ         విస్తృత స్థాయి సమావేశం  1
1/1

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement