
శ్రీకాకుళం
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025
మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు!
మొక్కజొన్న రైతుకు మద్దతు కరువైంది.
దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో భారీగా నష్టపోతున్నారు.
–12లో
నిబంధనలు పట్టవా..?
నర్సింగ్ కళాశాలలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నారు.
–12లో
●
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు పత్రికా స్వేచ్ఛ ను హరించడమే. ఇలాంటి దుశ్చర్యలు ప్రభుత్వం మానుకోవాలి. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ తెరిచి పత్రికా ఎడిటర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదికాదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినా జర్నలిస్టుల జోలికి ఎవరూ పోలేదు. ఇప్పుడు సెర్చ్ వారెంట్, నోటీసులు లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు చొరబడటం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే.
– బొడ్డేపల్లి మోహన్‌రావు,
ప్రజా న్యాయవాది, ఆమదాలవలస
సిటిజన్ ఫోరం ఉపాధ్యక్షుడు
ఆమదాలవలసలో..
ఆమదాలవలస: కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమదాలవలసలో జర్నలిస్టులు శుక్రవారం ధర్నా చేపట్టారు. అక్రమంగా సోదాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దారు ఎస్.రాంబాబుకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఆమదాలవలస సిటిజన్ ఫోరం ఉపాద్యక్షులు, ప్రజా న్యాయవాది బొడ్డేపల్లి మోహన్‌రావు, సీనియర్ జర్నలిస్టులు యల్లాపంతుల శ్రీనివాసరావు, తమ్మినేని వాసుదేవరావు, మొజ్జాడ అన్నంనాయుడు, చంద్రశేఖర్, పి.రామారావు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గలో..
కాశీబుగ్గ: పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ జి.వెంకటేష్‌కు వినపతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిగురువలస జగదీ
ష్, జాతీయ కన్వీనర్ దానేశ్వర మహారణ, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, సీఐటీయూ నేత నెయ్యిల గణపతి, పీడీఎస్‌యూ ప్రతినిధి మద్దిల వినోద్‌కుమార్, కోనారి హేమసుదన్, వంకల రాజారావు, శర్వాణ రవికుమార్, నంబాళ్ల రమేష్‌కుమార్, రట్టి జోగారావు, మురళి, పత్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పలాస ఆర్డీఓ వెంకటేష్‌కు వినతిపత్రం అందిస్తున్న పాత్రికేయులు,
ప్రజా సంఘాల నాయకులు
న్యూస్‌రీల్

శ్రీకాకుళం

శ్రీకాకుళం