
14567
టెక్కలి: వయో వృద్ధులు కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా టోల్‌ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయవచ్చని టెక్కలి సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల నిర్వహణ, తల్లిదండ్రుల పోషణ చట్టంపై బుధవారం టెక్కలి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వృద్ధుల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం 14567 టోల్ ఫ్రీ నంబరు కలిగిన ఎల్డర్ లైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కిరణ్‌కుమార్, క్షేత్రస్థాయి సిబ్బంది తిరుపతిరావు, ఇన్‌చార్జి తహసీల్దారు కిషోర్, పోలీస్ సిబ్బంది, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
