
భక్తరపల్లిలో రేపు భూతప్ప ఉత్సవాలు
మడకశిర రూరల్: తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద భూతప్ప ఉత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మినీ భూతప్ప ఉత్సవాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు ఉత్సవాలకు భారీగా తరలివస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈమేరకు ఏర్పాట్లు చేసింది.
జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
ధర్మవరం: జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న 15వ జాతీయస్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు మధురిమ బాయి, వైష్ణవి, వర్ష ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ శనివారం తెలిపారు. అలాగే కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్‌గౌడ్, చందు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్, అమునుద్దిన్, కిరణ్ హర్షం వ్యక్తం చేశారు.
రేపు ఫుట్‌బాల్ జిల్లా
బాల, బాలికల జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో సోమవారం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. 2012 జనవరి 1 నుంచి 2013 డిసెంబర్ 31 లోపు జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల వారు తమ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రేపటి ఎంపిక కార్యక్రమానికి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కార్యదర్శి మహమ్మద్ సలీమ్‌ను 80995 98958 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
పారిశుధ్య కార్మికునికి పాముకాటు
ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఎర్రగుంట రైల్వే బ్రిడ్జి సమీపంలోని పార్కు వద్ద శనివారం శుభ్రం చేస్తున్న సమయంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుడు శాంతమూర్తికి పాము కాటు వేసింది. గట్టిగా కేకలు వేయడంతో తోటి కార్మికులు వచ్చి ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యామ్సన్ కార్మికుడు శాంతమూర్తిని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం కార్మికుడిని పుట్టపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శాంతమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. ఇదిలా ఉండగా కాటు వేసిన పామును కార్మికులు పార్కులోనే చంపేశారు.

భక్తరపల్లిలో రేపు భూతప్ప ఉత్సవాలు

భక్తరపల్లిలో రేపు భూతప్ప ఉత్సవాలు