
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
పుట్టపర్తి టౌన్: సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుని నేరాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి ఎస్పీ రత్న సూచించారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి కిట్లు, లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత అధునిక యుగంలో సాంకేతిక నైపుణ్యాలను ప్రతి పోలీస్ అధికారి మెరుగుపరుచుకోవాలన్నారు. నేర నియంత్రణలో స్పెషల్ బ్రాంచ్ పాత్ర కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం తెలుకొని నియంత్రణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఆర్‌ఐ వలి, సోషల్ మీడియా ఎస్‌ఐ మునిప్రతాప్‌తోపాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.