
సాయి నామం.. దివ్య చరితం
ప్రశాంతి నిలయం: ఆశాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు చేపట్టిన ఆశాడీ దిండి పర్తియాత్ర శనివారం ప్రశాంతి నిలయం చేరుకుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్రికులు సత్యసాయి మహాసమాధి చెంత పల్లకీని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. అంతకుముందు వారు ధర్మవరం రైల్వేష్టేషన్‌లో రెండు రోజుల క్రితం దిగి అక్కడి నుంచి సత్యసాయి పల్లకీని ఊరేగిస్తూ పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి వేషధారణలో సత్యసాయి బోధించిన మానవతా విలువలను ప్రచారం చేస్తూ పాదయాత్ర సాగించారు.
అలరించిన సంగీత కచేరీ
ఆశాఢ ఏకాదశి సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఆర్యా అంబేకర్ బృందం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. ఆశాఢ ఏకాదశి విశిష్టతను వివరిస్తూ చక్కటి భక్తిగీతాలను ఆలపించారు. బాలవికాస్ చిన్నారులు ఆశాఢ ఏకాదళి వైభవాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సాయి నామం.. దివ్య చరితం

సాయి నామం.. దివ్య చరితం