
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి అవకాశం
పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాప్తాడుకు చెందిన కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్‌రెడ్డి, ముదిగుబ్బకు చెందిన వీరాంజనేయులు, అంకే లక్ష్మన్న, పుట్టపర్తికి చెందిన పి.సుధాకరరెడ్డి, జి.శేషురెడ్డిలను నియమించారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీల్లో జిల్లా నుంచి పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువజన విభాగం అధికార ప్రతినిధిగా వి.అమరనాథరెడ్డి (ధర్మవరం), రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్ ప్రెసిడెంట్‌గా టి.గంగాధర్‌రెడ్డి (పెనుకొండ), ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా డి.లక్ష్మానాయక్ (ధర్మవరం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.సురేష్‌కుమార్‌రెడ్డి (హిందూపురం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా జి,రమేష్ (ధర్మవరం) స్టేట్ పంచాయతీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.నాగరాజు (పుట్టపర్తి)స్టేట్ పంచాయితీ వింగ్ సెక్రటరీగా కె. రవీంద్రరెడ్డి ( పుట్టపర్తి )నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్‌పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్‌రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి అవకాశం