
ప్రభుత్వ తీరుతో నష్టం
ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కాలంలో ఉపాధ్యాయుల బదిలీలు, శిక్షణలు నిర్వహించాలి. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభంలోనే బదిలీలు చేపట్టారు. ఇదే సమయంలోనే శిక్షణ పేరుతో తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించలేక ఉపాధ్యాయులు సతమతమయ్యారు. దీంతో 1వ తరగతి చేరే విద్యార్థులు కరవయ్యారు. ప్రభుత్వ తీరుతో తీరని నష్టం చేకూరుతోంది.
– బడా హరిప్రసాదరెడ్డి,
ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు