ఆర్టీసీ గణాంకాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ గణాంకాలు

Jul 4 2025 7:11 AM | Updated on Jul 4 2025 7:11 AM

ఆర్టీ

ఆర్టీసీ గణాంకాలు

● మడకశిర మండలం ఎల్లోటి గ్రామంలో 2 వేల మంది జనాభా ఉన్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సుమారు 25 మంది విద్యార్థులు ఆటోల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలోని తడకలపల్లికి చేరుకుని, అక్కడి నుంచి బస్సులు ఎక్కాల్సి వస్తోంది.

● పరిగి మండల కేంద్రానికి 4 కి.మీ దూరంలో ఉన్న శ్రీరంగరాజుపల్లికి బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామంలో వందలాది మంది సమీపంలోని గార్మెంట్స్‌ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో వీరు రోజూ ఆటోల ద్వారా పనులకు వెళ్తున్నారు. ఇక మండలంలోని మోదా, పి.నరసాపురం, ఊటుకూరు, ఎర్రగుంట, శాసనకోట, బాలిరెడ్డిపల్లి, నేతలపల్లి, గణపతిపల్లి, కొత్త నరసాపురం పెద్దిరెడ్డిపల్లి గ్రామాలకు కూడా బస్సు సదుపాయం లేదు.

● సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి రూ.కోట్లు ఖర్చు చేసి తారు రోడ్డు నిర్మించారు. అయితే బస్సు ఏర్పాటు చేయడం మరిచారు. బస్సుల్లేక విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో తుంగోడు, చిన్నబాబయ్యపల్లి, గుడిపల్లికి కూడా బస్సు లేదు. ఆటోల ద్వారా సోమందేపల్లి చేరుకుంటారు. చిన్నబాబయ్యపల్లి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి తుంగోడు క్రాస్‌ చేరుకోవాలి. కొనతట్టుపల్లి గ్రామస్తులు 3 కిలోమీటర్లు నడిచి వెలిదడకలకు చేరుకుంటే బస్సులు అందుబాటులో ఉంటాయి.

398

జిల్లాలో మొత్తం బస్సులు

లగ్జరీ 50 ఎక్స్‌ప్రెస్‌ 120

ఇంద్ర 4 పల్లెవెలుగు 224

బస్సు

డిపోలు – 6

డ్రైవర్లు 660

ఊరు దాటి వెళ్తేనే బస్సు

మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని రామాపురం చేరుకుంటే.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులో వెళ్లవచ్చు. పిన్నదరి గ్రామం నుంచి 4 కిలోమీటర్లు వెళ్తే.. పుల్లంపల్లి చేరుకుని అక్కడి నుంచి తాడిమర్రికి బస్సులు ఉంటాయి. మోదుగులకుంట, శివంపల్లి, భీమరాయునిపేట వారు తాడిమర్రికి చేరుకుంటేనే బస్సు ఎక్కే పరిస్థితి. పాలకులు స్పందించి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – బాల ఓబులేసు,

ఎం.అగ్రహారం, తాడిమర్రి మండలం

ఇతర

సిబ్బంది 380

కండక్టర్లు 560

135

బస్సు రూట్‌లు

3 లక్షలు

రోజుకు ప్రయాణికుల సగటు సంఖ్య

సాక్షి, పుట్టపర్తి: ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం. సుశిక్షితులైన డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. అయితే జిల్లాలో చాలా గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ ‘పల్లె వెలుగు’ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు, విద్యార్థులు, చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర నడక లేదా ఆటోలో వెళ్తే కానీ బస్సులను అందుకోలేని దుస్థితి. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం గురించి పట్టించుకోలేదు. జిల్లాలో 32 మండలాలు ఉండగా.. బస్సులు వెళ్లని గ్రామాలున్న మండలాలు 25 ఉండటం విశేషం. మున్సిపాలిటీ కేంద్రాలు తప్ప.. మిగతా అన్ని మండలాల్లోనూ బస్సు సర్వీసుల కొరత వేధిస్తోంది. చాలా గ్రామాలకు ‘ప్రగతి చక్రం’ దూరమైంది.

ప్రైవేటు వాహనాలే దిక్కు

జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, పెనుకొండ.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు ఉన్నాయి. కేవలం మున్సిపాలిటీ ప్రాంతాల్లో మాత్రమే బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో కర్ణాటక సరిహద్దున ఉండే చాలా గ్రామాలకు ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే రవాణా ఖర్చులు భరించాల్సిందే. గతంలో విద్యార్థులు, ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సంస్థ కొన్ని సర్వీసులను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నడిపేది. అయితే ఇటీవల సరైన ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) ఉండటం లేదనే కారణంతో చాలా సర్వీసులను రద్దు చేశారు.

ఆర్టీసీకి రోజుకు సగటున వసూలు

రూ.55లక్షలు

ఆర్టీసీ బస్సుల్లేక గ్రామీణుల అవస్థలు

మెజారిటీ గ్రామాలకు చేరని

ప్రగతి చక్రం

ప్రమాదమని తెలిసినా ఆటోలు, జీపుల్లోనే ప్రయాణం

పరిమితికి మించి ప్రయాణంతో

నిత్యం ప్రమాదాలు

ఊసే లేని మహిళలకు

ఉచిత బస్సు ప్రయాణం పథకం

ప్రైవేటు వాహనాలపైనే ఆధారం

లేపాక్షి మండలంలో కోడిపల్లి పంచాయతీ మారుమూలన ఉంది. ఏ గ్రామానికి వెళ్లాలన్నా ఆటోలు, లేదా ద్విచక్రవాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లేనందున దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు పడరానిపాట్లు పడుతున్నారు. గతంలో మా పంచాయతీకి ఆర్టీసీ సంస్థ 10 సింగిల్స్‌ నడిపి.. కలెక్షన్లలో డిపోలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

– మల్లికార్జున, కోడిపల్లి, లేపాక్షి మండలం

జిల్లా కేంద్రం దగ్గరే ఉన్నా..

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి సమీపానే పైలబోయినపల్లి ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేదు. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పులేటిపల్లి, వెంకటాంపల్లి, ఓబుళంపల్లి, ఆమిదాలకుంట గ్రామాలు పుట్టపర్తికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. గతంలో ఉన్న బస్సు సర్వీసులను రద్దు చేశారు. కొత్తచెరువు నుంచి ఆమిదాలకుంట మీదుగా చెన్నేకొత్తపల్లికి బస్సు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.

– రాంగోపాల్‌రెడ్డి, పైలబోయినపల్లి,

చెన్నేకొత్తపల్లి మండలం

ఆర్టీసీ గణాంకాలు 
1
1/4

ఆర్టీసీ గణాంకాలు

ఆర్టీసీ గణాంకాలు 
2
2/4

ఆర్టీసీ గణాంకాలు

ఆర్టీసీ గణాంకాలు 
3
3/4

ఆర్టీసీ గణాంకాలు

ఆర్టీసీ గణాంకాలు 
4
4/4

ఆర్టీసీ గణాంకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement