
300 మామిడి చెట్ల నరికివేత
పుట్టపర్తి టౌన్: మండలంలోని వెంగలమ్మచెరువు గ్రామంలో వైఎస్సార్ ీసీపీ సానుభూతిపరుడు వీరనారప్ప తోటలోని మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్ల క్రితం దాదాపు 400 మామిడి మొక్కలను ఆయన నాటారు. మంగళవారం సాయంత్రం తోటలో పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి చొరబడి 300 చెట్లను నరికి వేశారు. బుదవారం మధ్యాహ్నం రైతు కుటుంబ సభ్యులు తోట వద్దకెళ్లి చూడగా నరికి వేసిన చెట్టు కనిపించాయి. ఘటనపై పుట్టపర్తి రూరల్ పీఎస్ ఎస్‌ఐ లింగన్నకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన దాయాదులు లింగప్ప, రాము, లక్ష్మీనారాయణపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వారు తనపై దాడి చేశారని, ఆర్థికంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, నరసారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుడికి ధైర్యం చెప్పారు.
‘తల్ సైనిక్’ ఎంపికే లక్ష్యం కావాలి
● ఎన్‌సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ అలోక్ త్రిపాఠి
కూడేరు: ఈ ఏడాది ఆగస్టులో న్యూఽఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంప్‌నకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేయాలని ఎన్‌సీసీ క్యాడెట్లకు కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి సూచించారు. కూడేరు మండలంలోని ఎన్‌సీసీ నగర్‌లో సీఏటీసీ–5 ఎన్‌సీసీ ఽశిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 500 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. బుధవారం కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి హాజరై, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్‌లో శిక్షణను పరిశీలించారు. ఏకాగ్రత, ఆత్మ విశ్వాసమున్నపుడే అన్నింటా రాణించగలుగుతారని పేర్కొన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు సునీత, రాజ్యలక్ష్మి, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

300 మామిడి చెట్ల నరికివేత