
కిచెన్, రూఫ్ గార్డెన్‌తో లాభాలు
పుట్టపర్తి అర్బన్: స్వంతంగా తయారు చేసుకునే కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఎనుములపల్లిలో కిచెన్ గార్డెలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, పండ్ల మొక్కలు వేసుకోవడంతో ఇంటికి సరిపడా కూరగాయలు పండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో మార్కెట్ ధరలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెలను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి నవీన్‌కుమార్, సహాయకులు వేమారెడ్డి , రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
‘కియా’లో సినిమా షూటింగ్
పెనుకొండ రూరల్: వరుణ్ తేజ్ హీరోగా నూతనంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లోని పలు సన్నివేశాలను కియా పరిశ్రమలోని ఆవరణలో శనివారం చిత్రీకరించారు. పరిశ్రమలోనే మరో రెండు రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

కిచెన్, రూఫ్ గార్డెన్‌తో లాభాలు