
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
● మంత్రి సవిత
రొద్దం: జిల్లాలోని ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేపట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళీ శాఖ మంత్రి సవిత అన్నారు. రొద్దం మండలం బొక్సంపల్లి క్రాస్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన 59.37 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. సొంత ఊళ్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.