
పలువురికి పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీ
హిందూపురం టౌన్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో 237 మందికి ఇంటి పట్టాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్లను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కలెక్టర్ టీఎస్ చేతన్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని, వచ్చే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.