
నల్లమాడ: యువగళం పేరుతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం మండలంలోని పులగంపల్లి మీదుగా 12 కిలోమీటర్లు సాగింది. ఓడీ చెరువు మండలపరిధిలోని మిట్టపల్లి మీదుగా వణుకువారిపల్లికి వెళ్లే రహదారిలో ఏర్పాటుచేసిన రాత్రి బస కేంద్రానికి సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు.
విడిది కేంద్రం వద్ద, పులగంపల్లి, మిట్టపల్లి బస్టాప్‌లో కార్యకర్తలు, మహిళలతో సెల్ఫీలు దిగడానికే లోకేష్ ఎక్కువ మక్కువ చూపారు.మిట్టపల్లి వద్ద కొద్దిసేపు దివ్యాంగులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. లోకేష్ వెంట మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులున్నారు.