మార్కెటింగ్‌పై రైతులకు శిక్షణ
నెల్లూరు(పొగతోట): ఎఫ్‌పీఓల్లో ఉన్న రైతులకు పంటల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ)లు, ఏపీఎంలు, సీసీలు, బీఓడీలు తదితరులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. సంస్థలోని కార్యక్రమాలు అమలు చేయడానికి ఉత్సాహవంతులైన రైతులను డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఏర్పాటు చేసుకునేలా లైసెన్సుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన పంటలకు ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కల్పించాలన్నారు. శిక్షణ, యంత్రాలకు బ్యాంక్‌ల నుంచి రుణాల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్‌జీఓ డాక్టర్ ఎన్‌వీఆర్ గణేష్ మాట్లాడుతూ ఏడు జిల్లాల్లో 72 ఎఫ్‌పీఓలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
5న మెగా పీటీఎం
నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులచే అమలు జరుగుతున్న కార్యక్రమాలు, అసెస్‌మెంట్ బుక్‌లెట్లు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, స్పోర్ట్స్ కిట్స్, పాఠశాల ప్రగతిని ప్రదర్శించాలన్నారు. , సౌకర్యాలపై చర్చ, ఫీడ్‌బ్యాక్ సేకరణ, ముగింపు సెషన్లను నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు మీటింగ్‌లో తప్పకుండా పాల్గొనాలని కోరారు.
కండలేరులో 58.690 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 58.690 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.12
సన్నవి : రూ.6
పండ్లు : రూ.3


