గంజాయి కేసులో దంపతుల అరెస్ట్
● 7 కిలోల స్వాధీనం
కొడవలూరు: గంజాయి కేసులో భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడవలూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సీఐ ఎ.సురేంద్రబాబు వివరాలు వెల్లడించారు. బక్కి చినరాజా, లక్ష్మీది తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం సారపాక గ్రామం. వీరు నెల్లూరు డైకస్ రోడ్డులోని చాణక్యపురి కాలనీలో స్థిరపడ్డారు. ఇద్దరూ కొడవలూరు మండలం గండవరం ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా కొడవలూరు, విడవలూరు ఎస్సైలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పట్టుకుంది. వారి వద్ద ఏడు కిలోల గంజాయిని గుర్తించారు. డిప్యూటీ ఎంపీడీఓ సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు సీహెచ్ కోటిరెడ్డి, పి.నరేష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అజిత అభినందించి రివార్డులు ప్రకటించారు.


