గండిపాళెంలో యూపీ వ్యక్తి గల్లంతు
ఉదయగిరి: ఆ యువకుడిది పేద కుటుంబం.. తల్లిదండ్రులకు అసరాగా ఉండేందుకు ఉపాఽధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో గండిపాళెం జలాశయంలో గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి మిత్రుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ (24) వారం రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వచ్చాడు. మేసీ్త్ర చెప్పిన ప్రాంతాలకు వెళ్లి పెయింట్ పనులు చేశాడు. మూడు రోజుల నుంచి వరికుంటపాడు మండలం కాంచెరువులో ఓ భవనంలో పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నిత్యావసర సరుకుల కోసం స్నేహితుడితో కలిసి గండిపాళెం వచ్చాడు. తిరిగెళ్తూ జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. లోతట్టు గేటు వద్ద ఉన్న నీటిని సౌరభ్ అందుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. మిత్రుడు కేకలు వేయడంతో అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు.
గండిపాళెంలో యూపీ వ్యక్తి గల్లంతు


