నిరసనల జయప్రదానికి పిలుపు
నెల్లూరు సిటీ: రైతుల సమస్యలపై ఈ నెల పదిన.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని రామకోటయ్య భవన్‌లో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని చెప్పారు. వీటిపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు భారీగా తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి
నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉందని, వర్షాలతో ఎక్కడా గండిపడకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, ఏఎస్పీ సౌజన్య పాల్గొన్నారు.
నగరంలో మంత్రి పర్యటన
నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీల్లో రూ.150 కోట్లతో కాలువల పూడికతీత పనులను చేపట్టామన్నారు. కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
నిరసనల జయప్రదానికి పిలుపు
నిరసనల జయప్రదానికి పిలుపు


