
గుర్తుతెలియని వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: నగర పంచాయతీ పరిధిలోని జొన్నవాడ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించి స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని 108 అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
ఆరోగ్యానికి
ప్రాధాన్యమివ్వాలి
నెల్లూరు(అర్బన్): మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నెల్లూరు అబ్‌స్టెట్రిక్, గైనకాలజికల్ సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సుప్రజ, డాక్టర్ లలితా షిర్ధీశా అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నెల్లూరు అబ్‌స్టెట్రిక్ సంఘానికి చెందిన మహిళా డాక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె తన పిల్లలను, భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందన్నారు. మారిన ఆధునిక జీవనంలో రుతుక్రమంలో మార్పులు రావడం, ఊబకాయం సమస్యలు వస్తున్నాయన్నారు. ఆలస్యపు వివాహాల వల్ల సంతాన సాఫల్యత లేకపోవడం కూడా జరుగుతుందన్నారు. హైరిస్క్‌తో కూడిన గర్భిణులు ఎక్కువవుతున్నారన్నారు. ఇందువల్ల కాన్పులో సమస్యలు వస్తున్నాయన్నారు. అందువల్ల ఆరోగ్యానికి మహిళలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు డాక్టర్ వాణి, డాక్టర్ అహల్య, డాక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి