ఇది ముమ్మాటికీ అక్రమ కేసే | - | Sakshi
Sakshi News home page

ఇది ముమ్మాటికీ అక్రమ కేసే

Jul 2 2025 5:06 AM | Updated on Jul 2 2025 7:20 AM

ఇది ముమ్మాటికీ అక్రమ కేసే

ఇది ముమ్మాటికీ అక్రమ కేసే

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను స్పష్టంగా పోలీసులను అడిగేది ఒకటే. నా పాత్రపై ఏమైనా ఉంటే రుజువు చేయగలరా? ఇది అక్రమ కేసని తెలియకుండా కప్పిపుచ్చడానికి పోలీస్‌ కస్టడీ పేరుతో దొంక తిరుగుడు ప్రశ్నలు సంధించడం తప్ప మరోకటి లేదు. రెండు రోజులుగా పోలీస్‌ కస్టడీలో నా పాత్ర గురించి కానీ, నాకు ఒనగూరిన లబ్ధి గురించి ఏ చిన్న ఆధారాన్ని పోలీసులు చూపించలేకపోయారంటే ఇది ముమ్మాటికీ అక్రమ కేసు బనాయించడమేని అర్థమవుతోంది.’ అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసులను నిలదీసినట్లు సమాచారం. కృష్ణపట్నం లాజిస్టిక్‌ చెక్‌పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేశారని నమోదైన అక్రమ కేసులో సెంట్రల్‌ జైల్లో జ్యుడిషి యల్‌ రిమాండ్‌లో ఉన్న కాకాణిని రెండు రోజులపాటు ముత్తుకూరు పోలీసులు పోలీస్‌ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. మొదటి రోజు 52 ప్రశ్నలు, రెండో రోజు మంగళవారం ఆరు ప్రశ్నలు అడగడంతో కాకాణి దీటుగా సమాధాన మివ్వడంతో పోలీసులు సైతం నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.

పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం

మీరు అక్రమ కేసులు బనాయించడం, సాక్షులు, సహ నిందితులను భయపెట్టి బెదిరించి ఇష్టారీతిన స్టేట్‌మెంట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తెల్ల కాగితాల మీద ముందుగానే సంతకాలు తీసుకుంటున్నారు. న్యాయస్థానంలో నిలబడని స్టేట్‌మెంట్లపై నేను వ్యాఖ్యానించ దలుచుకోలేదు. నేను తప్పు చేసి ఉంటే సాంకేతిక పరంగా విచారణ చేసి నా పాత్ర ఉందని రుజువు చేస్తే నేను ఏ శిక్షకై నా సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సవాల్‌ విసిరారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ అక్రమ కేసుల్లో వైఎస్సార్‌సీపీ చెందిన వారినే నిందితులుగా చూపిస్తూ డాక్యుమెంట్‌లో ఉన్న మిగిలిన వారిని వదిలి వేయడం పోలీసుల పక్షపాతి వైఖరికి నిదర్శనమని విమర్శించారని సమాచారం. ఎవరో చేసే వ్యాపారాలకు నన్ను జవాబుదారి చేయడం పోలీసులకు భావ్యం కాదన్నారు. నాకు అసోసియేషన్‌ గొడవలతో ఏంటి సంబంధం, పత్రికల్లో వచ్చిన వార్తలను నేను పట్టించుకోను. ఇటీవల పోలీస్‌ కస్టడీకి తీసుకున్నప్పుడు ‘ఓ ఎల్లో పత్రికలో నాకు గుర్తులేదు. మా న్యాయవాదులను అడగండి’ అని చెప్పినట్లు నేను మాట దాటవేసినట్లు రాశారు. ఇవన్ని అసత్యాలే. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెపుతున్నాను. నాకు తెలియని విషయాలు మాత్రం తెలిదయనే చెప్పుతున్నాను. నాపై బురద చల్లేందుకు కక్ష కట్టి తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. నాకు సంబంధం లేని ఈ కేసులో పోలీసులు ఏ–1గా చేర్చారు. ఇది కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసిందనేందుకు ఇదే నిదర్శనంగా చూపవచ్చు.

సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలపై కేసులా?

సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు నాతో పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నా మీద, వైఎస్సార్‌సీపీ నాయకులు మీద నిత్యం అసత్య ఆరోపణలు చేశారు. యూనియన్‌ గొడవల్లోకి రాజకీయ జోక్యం అవసరం లేదు. ఏ యూనియన్లతో కానీ, ప్రెస్‌మీట్లతో కానీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నాపై అక్రమ కేసు బనాయించినట్లే అవుతోంది. రెండు రోజుల పాటు నన్ను కస్టడీకి తీసుకున్నారు కదా నా సమక్షంలోనే సాక్షులను విచారిస్తే నాకు వారితో సంబంధం లేదని తెలుస్తోంది. అలా చేయకుండా కస్టడీ పేరుతో ఏదో జరుగుతుందంటూ ప్రచారం చేయడానికి కాకపోతే దేనికి ఇదంతా అని కాకాణి సంధించిన పలు ప్రశ్నలకు పోలీసులు సైతం నీళ్లు నమలాల్సి వచ్చింది.

కృష్ణపట్నం కేసులో తన పాత్రపై

స్పష్టత ఇవ్వగలరానని కాకాణి డిమాండ్‌

పలు ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానం

తిరిగి సమాధానం చెప్పలేక

నీళ్లు నమిలిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement