
సారీ తప్పయింది..
ఉదయగిరి: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో 12 ఏళ్ల బాలికతో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించారనే ఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఉదంతంలో వైద్యుడిపై దౌర్జన్యం చేసి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తాజాగా దీనికి సంబంధించి స్థానిక సీహెచ్‌సీలో బాలిక తల్లిదండ్రులు, బంధువులు, వైద్యుడితో కలిసి విలేకరుల సమావేశాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించలేదనే విషయం స్పష్టమవడంతో వైద్యుడికి క్షమాపణలను తెలియజేశారు. బాలిక చెప్పిన మాటలకు పొరబడి తాము దురుసుగా ప్రవర్తించామని, దీన్ని మనస్సులో పెట్టుకోకుండా విధులకు హాజరుకావాలని కోరారు. ఘటన సమయంలో కొంతమంది వ్యక్తులు జోక్యం చేసుకొని దురుసుగా ప్రవర్తించారని వారు తెలిపారు.
విచారణకు కమిటీ
ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేందుకు గానూ ఓ కమిటీని జిల్లా వైద్యాధికారి ఏర్పాటు చేశారు. రెండ్రోజుల్లో విచారణ జరిపి నివేదికను సమర్పించనున్నారు. కాగా ఈ ఉదంతంపై ఎస్సై ఇంద్రసేనారెడ్డిని సంప్రదించగా, విచారణ కొనసాగుతోందని బదులిచ్చారు.
అసభ్య ప్రవర్తనలో వైద్యుడికి క్లీన్‌చిట్
తామే పొరపడ్డామని అంగీకరించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు